Sunday, September 2, 2012

గదిలో సముద్రం


ఎన్నిసార్లు నా గదిలోకొచ్చిందో సముద్రం.
వచ్చినప్పుడల్లా టేబిల్ మీద కాగితాలు నిక్కపోడుచుకుంటాయి.
తిరిగిపొతూ అది మిగిల్చిన నురగలు
అచ్చుపడ్డ అక్షరాల్లా మెరుస్తుంటాయి
గదిలోకి చేరుకునే సముద్రాన్ని చూస్తుంటే
ఎవరో మహానుభావుడు  తలవంచుకుని
పూరి గుడిసెలోకి ప్రవేశించినట్టినిపిస్తుంది

CNR

No comments: