Tuesday, April 12, 2011

చీకటి మాయమౌతుంది



నువ్వు పలక్కపోతే, నీ మౌనంతో నా హృదయాన్ని నింపుకొని వోర్చుకొని వూరుకుంటాను.
సహనంతో తలక్రిందకి వొంచి నక్షత్రాలతో నిరీక్షణలో నిలిచే రాత్రివలే నేను కూచుని వుంటాను,మెదలకుండా.

తప్పదు,తెలవారుతుంది.చీకటి మాయమౌతుంది.
స్వర్ణధారలతో ఆకాశాన్ని చీల్చుకుని నీ కంఠం వర్షిస్తుంది.
అప్పుడు ప్రతి పక్షి కులాయం లోంచి నీ మాటలు పాటలుగా  రెక్కలు  చాస్తాయి.
నా లోని అరణ్య నికుంజాలలో నీ రాగాలు పువ్వులుగా బద్దలువుతాయి.

అంతం లేదు



తెగిన నక్షత్రాల నుండి
వెలువడుతుందో వసంతరాగం
రాతి గుండె నుండి
చిగురిస్తుందో మొక్క