Thursday, April 9, 2009

ధైవభక్తి-భయం

భయమంటే అర్ద్థం చేసికోకుండా దాని నుండి పారిపోతాం. ఆ పారిపోవడమే భయం. తెలిసిందాని వైపు పరిగెత్తుతాము. తెలిసింది నమ్మకాలు,వ్రతాలు,దేశభక్తి,మత ప్రబోధకుల సూత్రాలు,మత గురువుల హొమాలు వగైరా.ఇవే మనిషికి మనిషికి మధ్య ఘర్షణ తెస్తున్నాయి. అందుకే సమస్య తరతరానికి వ్యాపిస్తుంది. దాని మూలానికి వెళ్ళితే గాని సమస్య తీరదు. కనుక ఇది చెయ్యంది, అది చెయ్యంది అనే విధేయాత్మక ప్రబోధం వినాశకరమైంది.

భయమున్నప్పుడే నమ్మకం పుట్టేది. దేవుణ్ణేందుకు నమ్ముతాడు?. తనలో తనకు పూర్తిగా అనిశ్చింత వుండబట్టే కదా?. జీవితంలో విషయాలు,వస్తువులు పరిణామం చెందుతున్నాయి.అనిశ్చింత వుంది భద్రత లేకుండ వుంది.సౌఖ్యం లేదు,మితిమీరిన దుఃఖం వుంది. ఇవన్ని కనబడుతున్నాయి.అంచేత ఆలోచన ఒక శాశ్వతం అనబడే ఒక వస్తువుని ఆరోపించుకుంటుంది.దానికి దేవుడని పేరు పెట్టింది.దానిలొ మానవ మేధస్సు సౌఖ్యాన్ని పొందుతుంది. అయితే అది సత్యం కాదు.

ఈ జీవితం నిరంతరం పోరాటం.అందులో దుఃఖం,భాధ,ఆపేక్ష,జారిపొయే ఆనందం,వచ్చిపొయే సుఖం వున్నాయి.వాటికి ఆవల ఏదో ఉందని,దాన్ని ఆలంబనం చేసుకోవాలని మనసు అనుకుంటుంది.దాంతో తాదాత్మ్యం చెందాలని అనుకుంటుంది.దానికి దేవుడని,సత్యమని మనసు పేరు పెడుతుంది.నమ్మకం ద్వారా,నచ్చుబాటు ద్వారా,తర్కం ద్వారా అనేక రకాల శిక్షణా విధానాలు ద్వారా, ఆదర్ష ప్రాయమేన నీతి ద్వారా దానిలో తాదాత్మ్యం చెందుతుంది.కాని ఆ విశాలమైనది,ఊహగానంలో వున్నది "నేను" అనే దానిలో ఒక భాగమే. జీవిత పరిక్ష నుండి తప్పించుకోవాలనే తాపత్రయంలో మనసే దాన్ని ప్రవేశపెట్టింది.

So, "be fearless". There is no GOD or Devil. It is just YOU. మీరు మీతో గడపండి.మీ మనసుని అర్ధం చేసుకొండి.సత్యాన్ని కనుగొనండి..............సత్య మేవ జయతే.

2 comments:

Adhikari said...

If you come to my place alone i ll make you feel god.

let s sit calmly in the ruins of our hampi or in the hills of adi chunchina giri , when you can feel the presence of god.

if i sit there in meditation, i cry with happiness.

simple idea that i am meditating on him make me cry, tears ooze out, with joy.

hope god bless you to know what you dont know through me.

if he wishes me to be your guru, you ll plan and come here otherwise, you can not come here.

hope HE blesses you,

Adhikari said...

i am trying to post an emotional comment in response to your views on god, but in vain.

let us talk in person when you come here.

this is an invitation as well as a challenge .

you said there is no god

i ll make you feel god ,pl come