మనిషేలేడా !
కమ్మో,రెడ్డో,కాపో
అంటాడు గాని
మనిషినని చెప్పడేం ?
హిందువో,ముస్లిమో,క్రిస్టియనో
అంటాడు గాని
మనిషినని చెప్పడేం ?
ఇండియనో,అమెరికనో,రష్యనో
అంటాడు గాని
మనిషినని చెప్పడేం ?
అసలిక్కడ మనుష్యులే లేరా ?
వీళ్ళంతా మనుషులు కారా ?
సొమరిపోతు
కాలు వేసేది
దున్నేపోతు !
కాలు మీద
కాలు వేసేది
దున్నపోతు !
గ్లోబలి
సరుకులు పుట్టడం
సివిలైజేషన్!
మనిషినే
సరుకుగా పెట్టడం
గ్లోబలైజేషన్ !
కొబ్బరికాయ
తనని రాయికేసి
కొట్టినందుకు
కన్నీరు కురిసినా
రాతిబోమ్మలను తలచి కొలిచే
నీ మూడత్వానికి
తెల్లగా పగలబడినవ్వుతుంది
--సింగంపల్లి అశోక్ కుమార్ -