కళ్లల్లో సరిగమలు...మాటల్లో మధురిమలు...కట్టి పడేసే హావభావాలు..పెదవి విరుపుల్లో పదనిసలు...నిలువెత్తు వ్యక్తిత్వము...వెరసి సావిత్రి.సావిత్రి అంటే అభినేత్రికి అందమైన అంత్యప్రాస....మూర్తీభవించిన మంచితనం..గల గల పారె సెలయెరు..ఒక పసిపాప నవ్వు...ఒక సూర్యుడు...ఒక చంద్రుడు...ఒక భూమి ..ఒక సావిత్రి....అంతే.అంతే.
to be continued..
ఆలయాన వెలసిన ఆ దేవుడిరీతి...నాకు సావిత్రిగారంటే ఒక చెప్పలేని ఆభిమానం,ఆరాధననూ.తెలుగు సినీతల్లి చేసుకున్న పూజాఫలం...ఒక దేవత..ఒక ఆత్మ బంధువు...హఠాత్తుగా మిస్సైన ఒక మిస్సమ్మ.
సావిత్రి పూర్తి పేరు..కొమ్మారెడ్ది సావిత్రి. గుంటూరి జిల్లా చిర్రావూరులో 1937 జనవరి 11న జన్మించింది.అరుణోదయ నాట్యమండలిలో నాట్యరాణిగా రాణిస్తూ,నాటకాలలో వేషాలు వేయసాగింది.సినిమాలు అంటె తగని మక్కువ. సినిమాలు చూసి ఇంటికొచ్చి కన్నాంబలాగ, కృస్ణవేణిలాగా అద్దం ముందు కూర్చుని నటించేది. సాధన వారి "సంసారం" (1950) లోని "అబ్బో , అచ్చు హీరో నాగేశ్వరరావు లాగ వున్నాడే" అనేది తొలి డైలాగ్. తర్వాత విజయావారి "పాతాళ భైరవి" (1951) లో డాన్స్ డైరెక్టర్ పసుమర్తి కృష్ణమూర్తితో తొలి డాన్స్ చేసింది.