యండమూరి వ్రాసిన నవలల్లో నాకు బాగా నచ్చిన నవల అంతర్ముఖం. అది సుమారుగా తొంబై రెండు ఆ ప్రాంతల్లో యండమూరి వ్రాసారు.ఇప్పటికి కొన్ని వందలసార్లు అది నేను చదివివుంటాను.ప్రతి పేజీలోనూ గొప్పగొప్ప వాక్యాలు ఉన్నాయి.ప్రతి వాక్యంలోను గొప్ప గొప్ప భావాలున్నాయి.
అందులోనుంచి నాకు నచ్చిన కొన్ని వాక్యాలు/అభిప్రాయాలు:
ప్రేమ అంటే
ప్రేమ అంటె ఇవ్వటమే కాని తీసుకొవటం కాదు. ఎప్పుడయితే నీలో 'తీసుకోవటం' ప్రారంభమవుతుందో అప్పుడు అవతలివారికి నే పట్ల ప్రేమ నశిస్తుంది.అప్పుడు కూడా బంధాలు ఉండవచ్చు.కాని అది కృతజ్ఞత వల్ల అయి ఉండవచ్చు. లేదా కర్తవ్యంవల్ల అయి ఉండవచ్చు.అవసరం వల్లో అమాయకత్వం వల్లో ప్రారంభమై, ఆ తరువాత అది కర్తవ్యమై మరి కొంతకాలానికి ఎలా దూరమవ్వాలా అనుకునేది ప్రేమ కాదు.నిజమైన తల్లి అంటే- ప్రపంచంలో ఏ బిడ్దకు దెబ్బ తగిలినా విలవిల లాడాలి- అది ప్రేమ అంటే.
ప్రేమ అంటే
ప్రేమ అంటె ఇవ్వటమే కాని తీసుకొవటం కాదు. ఎప్పుడయితే నీలో 'తీసుకోవటం' ప్రారంభమవుతుందో అప్పుడు అవతలివారికి నే పట్ల ప్రేమ నశిస్తుంది.అప్పుడు కూడా బంధాలు ఉండవచ్చు.కాని అది కృతజ్ఞత వల్ల అయి ఉండవచ్చు. లేదా కర్తవ్యంవల్ల అయి ఉండవచ్చు.అవసరం వల్లో అమాయకత్వం వల్లో ప్రారంభమై, ఆ తరువాత అది కర్తవ్యమై మరి కొంతకాలానికి ఎలా దూరమవ్వాలా అనుకునేది ప్రేమ కాదు.నిజమైన తల్లి అంటే- ప్రపంచంలో ఏ బిడ్దకు దెబ్బ తగిలినా విలవిల లాడాలి- అది ప్రేమ అంటే.
ప్రేమ ఒక ప్రవాహం లాంటిది. కాలం అనే ఎత్తుపల్లాల మీద కన్వీనియంట్ గా, వ్యక్తిత్వం అనే వడుదుడుకుల మద్య, అవసరం అనే అవగాహన పెరిగేకొద్ది-ఒక పర్వతాన్ని వదిలి మరో శిఖరాన్ని ప్రేమించి,చివరకు సముద్రం అనే భద్రతాభావంలో స్థిరపడుతుంది.
పెళ్లి
పెళ్లి కోసం ఎందుకింత ఆరాటపడతారు! ఇప్పుడు సుఖంగా లేదని, తర్వాత సుఖపడిపొతామని ఆశా! లేక కేవలం శారీరకమైన సుఖం కొసమేనా!.లేక పెళ్లంటే ఒక థ్రిల్లా! కావచ్చు.పెళ్లయ్యే వరకు స్త్రీ, అయిన తరువాత పురుషుడు-భవిష్యత్తు గురించి ఆలోచిస్తారట.వయసునిబట్టి మనిషికి ఒక్కో థ్రిల్కావాలనిపిస్తుంది.చిన్నతనంలొ హీరోగా అడ్వంచర్లు చెయ్యాలని, టీనేజ్‌లో ప్రేమలొ పడాలని,కాస్త వయసు రాగానే పెళ్ళి గురుంచి ఆలోచనలు-అంతా అయిపోయాక ఎందుకు చేసుకున్నారో తెలియక సతమతమవడం తనను తాను తిట్టుకోవడం,కాని అప్పటికే పిల్లలు పుట్టటంతొ అడ్జస్టయిపోవటం,మరికొన్ని కొత్త అనుభవాల కోసం ప్రయత్నాలు ప్రారంభించడం-ఎందుకు! ఎందుకివన్నీ! మనిషి తనకు కావలసిందేమిటో తెలుసుకొని,ఆలోచించి, దాన్ని పొందగలిగే ప్రయత్నం చేసి, అది పొందలేన్నప్పుడు ఒంటరిగా మిగిలిపోతే తప్పేమిటి ?జీవితాన్ని మధురమైన భావనగా, ఒక చక్కటి అనుభవంగా మల్చుకొని బ్రతికే అవకాశం లేదా ?.
- ప్రతి మనిషిలోనూ ఒక మన్మదరావుంటాడని నా అభిప్రాయం.తన గత జీవితంలో కొన్ని అనుభవాల్ని తీసుకొని,వాటికి కొన్ని నగషీలు చెక్కి,వినే వాళ్ళకి తననో హీరోగా చిత్రీకరించుకోవటం ప్రతి మనిషికీ సర్వసామాన్యమైన విషయం.కొంతకాలానికి ఆ చెప్పే మనిషే,ఆ అనుభవం తనకి జరిగిందని,తనే నమ్మేటంత భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు
- మనిషి అభిప్రాయం మారడానికి ఒక తెల్లవెంట్రుక చాలు.
-ఈ ప్రపంచంలొ అబ్ సొల్యూట్ గా నైతిక విలువలంటూ ఏమీలేవు. మన అవసరాలు బట్టి మారుతూ వుంటాయి.
- ఆడ,మగ అన్న భేదాలు శరీరానీకే, అంతరంగానికి లేవని అంత చిన్న వయసులోనే గ్రహించగలిగినందుకు నా జోహార్లు. నేనింకా అంత ఎదగలేదు. అంటే ఒక స్త్రీ స్పర్శనీ, పురుషుడి స్పర్శనీ ఒకే స్థాయికి నేను ఇంక ఎదగ లేదు. నువ్వింకో వ్యక్తిని స్నేహితుడిగా వెతుక్కోవటం మంచిది. ముఖ్యంగా నీ ఉత్తరంలో వ్రాసేవు చూడు....."వొద్దు నాన్నా...కోపం ఎందుకు చిన్నా" అని... అటువంటి మెలో డ్రమెటిక్ భావాలకి పడిపోయే మొగాళ్ళు "కో" అంటే కోటి మంది దొరుకుతారు.