Sunday, October 5, 2008

వర్షం

రాజకీయ వర్షం

వ్యవసాయ కూలీల ఆకాశంలో
నిండైన వర్షం
కాని వసంతానికి ఇంకా తగ్గని దూరం
రాజకీయ వర్షంలో జల్లిన వరి విత్తనాలు
మొగ్గ తొడిగిన విషపు గన్నేరు కాయలు.

చేనేత వర్షం

చేనేత కార్మికుల ఆకాశంలో
దారానికి అందని చిరుగుల చుక్కలు
అదిగో నేల రాలుతున్న ఆకాశ నక్షత్రాలు.

A piece of poetry by my six year old daughter Geetanjali.

Hello Hello Hello Hello Say it four times
Yellow Yellow Yellow Yellow Say it four times
Buffalo Buffalo Buffalo Buffalo Say it four times
Hello Yellow Buffalo..:)

Monday, September 15, 2008

నువ్వూ- నేనూ

ఆకర్షించుకుంటూ-
భూమికి చెరోవైపునా
నేను దక్షిణ ద్రువంలో-
నువ్వు ఉత్తర హిమంలో
ఋతువుకి చెరోవైపునా
నేను శిశిరంలో
నువ్వు హేమంతంలో
రోజుకి చెరోవైపునా
నేను ప్రత్యూషంలో
నువ్వు సాయంసంధ్యలొ

Sunday, August 31, 2008

TV on the Web.

Oflate, Television entertainment has busted out of the TV and on to computer screens. No more worries, if you miss an important TV show..you can find them on the net for free. I am enumerating few of the my favorite sites that offer TV experience.

1.hulu.com (has best collection of TV shows and movies)
2.fancast.com ( Lots of TV shows..Comcast owned)
3.tvguide.com (Excellent search facility)
4.veoh.com ( has lots of ABC,CBS and ESPN content)
5.joost.com ( has 28000+ tv shows, 480+ tv channels)

Wednesday, August 27, 2008

పులకించని మది పులకించు

పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు
మనసునే మరపించు గానం
మనసునే మరపించు..

రాగమందనురాగ మొలికి
రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు
రూపమిచ్చును గానం

చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం
జీవ మొసగును గానం ..
మది చింత బాపును గానం ..
వాడిపోయిన పైరులైనా నీరు
గని నర్తించును కూలిపోయిన తీగయైనా

కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు
ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు
దోర వలపే కురియు...
మది దోచుకొమ్మనీ తెలుపు //పులకించని//

చిత్రం : పెళ్ళికానుక
గానం : జిక్కి
రచన : ఆత్రేయ
సంగీతం : ఏ.ఎం.రాజా

గుర్తుకొస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి .. గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి .. గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి...

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగచాటుగా కాల్చిన బీడి
సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి

మొదటిసారిగా గీసిన మీసం
మెదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్న
గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయిబు పూసిన సెంటు
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తియ్యందనము

చిత్రం : నా ఆటోగ్రాఫ్
గానం : కె. కె.
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి

Monday, August 25, 2008

తెలుగు భాష

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదంలోన అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది...
మామ అన్న మాట మనసులోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది
పర భాషా జ్ఞానాన్ని సంపాదించు
కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా
కొంత రుణం తీర్చరా

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమి పైన ప్రాణులన్ని తమ భాషను మరువలేదు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగురాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషాచారాలను మింగేయొద్దు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా
వెనక్కి తగ్గమాకురా

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా
అమ్మా నాన్నా అంటూ నేటినుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా..


రచన: చంద్రబోస్
చిత్రం: నీకు నేను నాకు నువ్వు